‘ఆదిపురుష్’లో కృష్ణం రాజు రోల్ ఇదే!

krishnam raju will play intresting role in prabhas adipurush

Prabhas adipurush: Krishnam Raju: ‘బాహుబలి’ తర్వాత మరో భారీ సినిమాను ఓకే చేశారు ప్రభాస్. ‘ఆదిపురుష్’ పేరుతో రూపొందనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది.

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.‌ ప్రభాస్‌ మాంచి ఫామ్‌లో ఉన్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ స్టార్ అయిన ఈ హీరో.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు. తనను హీరోగా తీసుకు వచ్చిన పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్ కు ఎనలేని గౌరవం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పెదనాన్న మాట జవదాటకుండా ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఉంటాడట ప్రభాస్. ఇప్పుడు పెదనాన్న రుణం తీర్చుకునేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడట.

నిత్యం ‘ఆదిపురుష్’‌కి సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్‌గా ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ నటించనుందనే వార్త ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగా, అంతకుమించి అన్నట్లు తాజాగా మరో విషయం బయటకొచ్చింది. బాలీవుడ్ లో రూపొందుతున్న ఆదిపురుష్ సినిమా ఆ దశాబ్దపు అద్బుతంగా నిలువబోతుందని అంతా అంటున్నారు.. అందుకే ఇంతటి గొప్ప సినిమాలో ఎప్పటికి నిలిచి పోయే పాత్రను కృష్ణంరాజుతో వేయిస్తే బాగుంటుందనే అభిప్రాయంలో ప్రభాస్ ఉన్నాడు. లేటెస్ట్ సమాచారం మేరకు పౌరాణిక చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కృష్ణంరాజు పాత్ర సినిమాలో కీలకం కానుందని తెలుస్తోంది.

స్వయంగా దర్శకుడు ఓం రౌత్ తో మాట్లాడి తన పెదనాన్న కోసం ఒక పాత్రను ఓకే చేయించాడట. ఆయన వయసుకు తగ్గ పాత్రను ఇప్పించి ఆదిపురుష్ లో భాగస్వామ్యం చేయడం వల్ల ఆయన జీవితంలో మరో గొప్ప సినిమాలో నటించాను అనే సంతృప్తిని కలిగించేలా చేస్తున్నాడు. పౌరాణిక నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించనున్నారని తెలిసింది. అలాగే రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించనున్నట్లు ఇటీవలే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.