బేబమ్మ స్పెష‌ల్ డ్యాన్స్ వీడియో వైర‌ల్

470
Krithi Shetty Eswara Official Video Song Trending
Krithi Shetty Eswara Official Video Song Trending

కృతిశెట్టి ‘ఉప్పెన‌’తో తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తొలి సినిమా సక్సెస్‌తో స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకుంది ఈ బ్యూటీ. కూచిపూడి నాట్యాన్ని ఇష్టపడే శృతి, శివ‌రాత్రి సంద‌ర్భంగా స్పెష‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. ఈశ్వ‌ర అంటూ సాగిన ఈ పాట‌కు చాలా అందంగా ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చింది.

 

కృతిలో దాగి ఉన్న ఈ టాలెంట్‌పై నెటిజ‌న్స్‌తో పాటు పలువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఉప్పెన భామ, నాని ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న  ‘శ్యామ్ సింగరాయ్‌’ సినిమాలో న‌టిస్తుంది. సుధీర్ బాబు హీరోగా తెర‌కెక్కుతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే చిత్రంలోను క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

 

 

ఇక రామ్ పోతినేని, లింగుసామి దర్శకత్వంలో రూపొంద‌నున్న సినిమాలో కథానాయిక‌గా ఎంపికైంది. ఇలా వ‌రుస ఆఫర్స్‌తో కృతి శెట్టి దూసుకెళ్తుంది.