లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఉప్పెన బ్యూటీ..!

0
6032
Krithi Shetty Romance with Ram charan in shankar RC15 movie

Ram Charan: Krithi Shetty: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటీ కృతి శెట్టి మరో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో 3 సినిమాలు ఉన్నాయి.

నాని తో ‘శ్యామ్ సింగ రాయ్’, రామ్- లింగుస్వామి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.

ఇక అందులో రామ్ చరణ్ – శంకర్ సినిమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో ఇప్పటికే కియరా అద్వానీ మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం ఫిక్స్ అయినట్లు టాక్ రాగా.. మరో హీరోయిన్ పాత్ర కోసం కృతి శెట్టి లాంటి బ్యూటీని తీసుకోవాలని చర్చలు జరుపుతున్నారట. ఇది ఎంతవరకు నిజమో తెలీదు. కానీ ఇటీవల కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న రామ్-లింగుస్వామి సెట్స్ కి దర్శకుడు శంకర్ వచ్చి టీంతో ముచ్చటించడంతో ఈ ప్రచారం మొదలైంది.

Krithi Shetty Romance with Ram charan in shankar RC15 film

ఒకవేళ ఆ సినిమా ఫిక్స్ అయితే ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా మారిపొయినట్లేనని చెప్పవచ్చు. మరి ఆ ఛాన్స్ ను కృతి ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి. లేటెస్ట్ గా మరో ఊహించని క్రేజీ బజ్ ఈ RC15 చిత్రంపై వినిపిస్తుంది. ఈ చిత్రంలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Previous articleరికార్డు స్థాయిలో ఎన్టీఆర్ కొరటాల NTR30 మూవీ బడ్జెట్..!
Next articleఅభిమానులకు క్షమాపణ చెప్పిన హీరో వెంకటేశ్‌..!