Homeసినిమా వార్తలుకృతి సమంత కు ఇచ్చింది కాంప్లిమెంటా లేక కమెంటా..!!

కృతి సమంత కు ఇచ్చింది కాంప్లిమెంటా లేక కమెంటా..!!

Krithi Shetty shocking comments on Samantha item song, Kriti Comments on Samantha viral, Samantha's Oo Antava Mawa item song, Custody, Naga Chaitanya, 

కస్టడీ బ్యూటీ కృతి (Krithi Shetty) సమంతపై (Samantha) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. పుష్ప మూవీలో సమంత (Samantha Item Song) డాన్స్ చేసిన ఊ అంటావా పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మొత్తం ప్రపంచం ఈ సాంగ్ కు ఫిదా అవ్వడమే కాకుండా ఈ పాటపై రకరకాల రీల్స్ కూడా చేసి ఆనందించారు. యూట్యూబ్లో అత్యధిక వ్యూ సొంతం చేసుకున్న పాటగా ఈ సాంగ్ రికార్డులు కూడా సృష్టించింది.

అయితే అటువంటి పాటపై బేబమ్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్లో హాట్ టాపిక్ గా మారాయి. కస్టడీ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న కృతి …సమంత చేసిన ఈ పాట గురించి మాట్లాడింది. తాను అటువంటి పాటలకు కచ్చితంగా దూరంగా ఉంటాను అని తేల్చి చెబుతూనే.. సమంత (Samantha) మాత్రం ఈ సాంగ్ కి అద్భుతంగా చేసిందని కాంప్లిమెంట్ రాపర్ చుట్టి మరి కామెంట్ చాక్లేట్ అందించింది.

మూవీ ప్రమోషన్ లో భాగంగా కృతి ను (Krithi Shetty) ” ఊ అంటావా మావ టైప్ స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశం మీకు వస్తే చేస్తారా?”అని అడిగినప్పుడు ఖచ్చితంగా చేయను అని తేల్చి చెప్పింది. ప్రస్తుతం తను అలాంటి ఐటెం సాంగ్స్ నటించాలనుకోవడం లేదని.. వాటిపై తనకు అవగాహన లేదని.. శ్యాం సింగరాయ చిత్రంలో నటించేటప్పుడు కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చేయవలసి వస్తే తను చాలా ఇబ్బందిగా ఫీలయ్యానని….తన సినిమా ప్రయాణంలో తెలుసుకున్న విషయం సౌకర్యంగా లేనప్పుడు చేయకపోవడమే బెటర్ అని చెప్పుకొచ్చింది కృతి.

Krithi Shetty shocking comments on Samantha item song

అంతవరకు బాగానే ఉంది కాని ఊ అంటావా పాట తనకు ఎంతో ఇష్టమని.. సమంత (Samantha) ఒక ఫైర్ అని.. ఆ పాట తను ఎంతో ఎక్సలెంట్ గా చేసిందని.. తను అలా ఎప్పటికీ చేయలేనని కృతి (Krithi Shetty) అంది. అంతా బాగానే ఉంది కానీ కృతి సమంతను పొగిందా లేక కామెంట్ చేసిందా అన్న విషయం స్పష్టత లేకపోవడంతో ఇది పెద్ద చర్చని అంశంగా మారింది.

అయితే ఇంకా ఈ కామెంట్స్ పై ఇంకా సమంత స్పందించలేదు.ఆల్రెడీ సమంతా చైతన్య మధ్య జరుగుతున్న ఆఫ్టర్ డైవర్స్ కాంట్రవర్సీస్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైతన్య మూవీ హీరోయిన్ సమంత గురించి పాస్ చేసిన ఈ కామెంట్ ఎటువంటి వివాదానికి దారితీస్తుందో చూడాలి.

- Advertisement -

Web Title: Krithi Shetty Reaction On Samantha Oo Antava Mava Song In Pushpa, Krithi Shetty shocking comments on Samantha item song, Kriti Comments on Samantha viral, Samantha’s Oo Antava Mawa item song, Custody, Naga Chaitanya,

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY