Homeసినిమా వార్తలు’ఉప్పెన’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే!

’ఉప్పెన’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్‌లో.. ఆయన శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే చిరంజీవి కుటుంబంలో చాలా మంది హీరోలు వెండితెరకు పరిచమై తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కోవలోనే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.. ఈ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ సినిమాను టాలీవుడ్‌లో వరుసగా సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు నిర్మించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కూడా ఈ చిత్రానికి దక్కడంతో పాజిటివ్ వైబ్స్‌తో ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 12) థియేటర్స్‌లో విడుదలైంది. ప్రతినాయకుడిగా నటించిన విజయ్ సేతుపతి సినిమాకి మరింత హైప్ తీసుకుని రాగా.. హీరోయిన్ కృతి శెట్టి ఎక్స్‌ప్రెషన్స్ కూడా సినిమాకు ప్రధానమైన బలంగా మారాయి. దానికి తోడు ఈ మూవీలో క్లైమాక్స్ విభిన్నంగా ఉండ‌నుంద‌ని పుకార్లు రావ‌డంతో మెగాభిమానులే కాదు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఎదురుచూస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద ఉప్పెన లాంటి కలెక్షన్లు రాబట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. తొలిరోజు బుకింగ్స్ అన్నీ హౌస్‌ఫుల్ కావడంతో పాటు యూఎస్ ప్రీమియర్ షోస్ అన్నీ ఫుల్ అయ్యాయి. ఇక చాలాచోట్ల ఈ సినిమా బెనిఫిట్ షోస్ పడటంతో ట్విట్టర్ వేదికగా స్పందనలు తెలియజేస్తున్నారు. కొంత మంది ఈ సినిమా సూపర్‌గా ఉంది. క్లైమాక్స్ అదిరపోయిందన్నారు. మెగా కుటుంబం నుంచి మరో పవర్‌ఫుల్ హీరో వచ్చాడని కొనియాడుతున్నారు.

Click here for Uppena Full Review 

ఉప్పెన క్లైమాక్స్ సీన్ కన్నీళ్లు తెప్పిస్తోందని, సినిమా సూపర్ డూపర్ హిట్ పక్కా అంటున్నారు. సినిమాను చూసిన వారంతా క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. మరికొంత మంది ఈ సినిమా రొటిన్ సొల్లు మూవీ. ఇందులో ఏమిలేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -

ఇంకొందరు మాత్రం ఈ క్లైమాక్స్ సీన్ ఉహించినంత స్థాయిలో ఆకట్టుకోలేదని చెబుతున్నారు. క్లైమాక్స్‌లో హీరో మర్మాంగాన్ని విజయ్ సేతుపతి కట్ చేయడం ఇప్పుడు ట్విట్టర్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

కృతి శెట్టి తనదైన నటనతో ఆకట్టుకుందని చెబుతున్నారు. హీరోగా వైష్ణవ్ తేజ్ మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడని చెబుతున్నారు. గతంలో చూసిన స్టోరీలా ఉన్న ట్రీట్‌మెంట్ కాస్త డిఫరెంట్‌గా ఉందని చెబుతున్నారు.

Related Articles

Telugu Articles

Movie Articles