ఆదిపురుష్ హీరోయిన్‌ని ఫిక్స్ చేస్తూ అఫీషియల్ స్టేట్‌మెంట్

399
prabhas Welcoming Kriti Sanon and Sunny Singh to the Adipurush family

యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్‌’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో శరవేగంగా కొనసాగుతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. అయితే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ విషయంలో చిత్రయూనిట్ సస్పెన్స్ మెయిన్‌టైన్ చేయడంతో గత కొన్ని రోజులుగా ఆ హీరోయిన్ ఎవరనే దాని గురించిన చర్చ ముదిరింది. తాజాగా చిత్ర బృందం పుల్ క్లారిటీ ఇచ్చేసింది. సీత పాత్రకు కృతి సనన్ పేరును వెల్లడించిన ప్రభాస్.. ఆమెకు వెల్‌కమ్ చెబుతూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు.

‘ఆదిపురుష్’ హీరోయిన్ కృతి సనన్ అని పరిచయం చేశారు ప్రభాస్‌. ఈ మేరకు ‘ఆదిపురుష్’ కుటుంబంలోకి స్వాగతం అని పేర్కొంటూ ఆమెతో దిగిన ఫొటో పోస్ట్ చేశారు. దీంతో పాటు ఈ సినిమాలో ఎంతో ముఖ్యమైన లక్ష్మణుడి పాత్రను పోషించే హీరో పేరునూ ప్రభాస్ వెల్లడించారు. ముందునుంచీ అంతా ఊహించినట్లుగానే బాలీవుడ్ హీరో సన్నీ సింగ్‌ను లక్ష్మణుడి పాత్ర రోల్ కోసం తీసుకున్నట్లు వెల్లడించారు.

అందరినీ వెనక్కి నెట్టేసి కృతి సనోన్ చోటు దక్కించుకోవడం ఆసక్తికరం. పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

Kriti Sanon And Sunny Singh Join The Cast Of Prabhas And Saif Ali Khan's Adipurush Kriti Sanon And Sunny Singh Join The Cast Of Prabhas And Saif Ali Khan's Adipurush poster