Balakrishna, Ks Ravikumar Movie Shooting Updates
Balakrishna, Ks Ravikumar Movie Shooting Updates

బాలయ్య బాబు ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. అయితే ఈ షెడ్యూల్ లో ఫుల్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ప్లాష్ బ్యాక్ లో ఈ సన్నివేశాలు వస్తాయి. బాలయ్య ఓ హోమం జరుపుతుండగా విలన్స్ బాలయ్య పై అటాక్ చేస్తారు. ఈ క్రమంలోనే బాలయ్య వారితో భారీ ఫైట్ చేస్తాడట. కాగా రేపటి షూటింగ్ తో ప్లాష్ బ్యాక్ లో వచ్చే యాక్షన్ పార్ట్ మొత్తం పూర్తవుతుందట. ఆ తరువాత జరగబోయే షెడ్యూల్ లో కీలకమైన ఫ్యామిలీ సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ సన్నివేశాల్లో బాలయ్య – భూమిక చావ్లా మధ్య వచ్చే సీన్స్ తో పాటు కొన్ని కామెడీ సీన్స్ ను ఉంటాయట. పైగా ఈ సీన్స్ లో జయసుధ, రావు రమేష్ కూడా ఉన్నారట.

ఇక ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ అండ్ వేదిక హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే వేదిక మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. అలాగే ఓ కీలకమైన పాత్రలో నమితను కనిపించనుంది. నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. ఇక ఈ సినిమాలో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు పవర్ ఫుల్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నాడు. బ్లాక్‌ బ‌స్ట‌ర్ `లెజెండ్‌` త‌ర్వాత బాల‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో ఈ సినిమా రూపొంద‌నుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.