Homeసినిమా వార్తలుLatest Buzz NTR30: ఎన్టీఆర్ కోసం కొరటాల మాస్టర్ ప్లాన్.. !

Latest Buzz NTR30: ఎన్టీఆర్ కోసం కొరటాల మాస్టర్ ప్లాన్.. !

Koratala Siva – NTR: రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR మూవీ పూర్తిచేసే పనిలో ఉన్న ఎన్టీఆర్ (JrNTR).. ఇది పూర్తయిన వెంటనే కొరటాల శివ సినిమాను లైన్‌లో ఉంచారు. ఎన్టీఆర్ 30గా ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఎన్టీఆర్‌తో (NTR) చేయబోయే సినిమా కోసం ఇప్పటినుంచే మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారని సమాచారం. ఈ మేరకు క్యాస్టింగ్ (Cast crew) విషయంలో వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారట కొరటాల.

ఈ చిత్రం లో ఎన్టీఆర్ కి (NTR) విలన్ గా ఒక యువ నాయకుడు పాత్ర ఉంటుంది అని తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులను దృష్టిలో ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కోసం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇతర భాష కి చెందిన యాక్టర్ ను అయినా తీసుకొవడానికి చిత్ర యూనిట్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వెండితెరపై తారక్‌తో పాటు భారీ క్రేజ్ ఉన్న ఇతర భాషల్లోని స్టార్ హీరోలను చూపిస్తూ చాలా గ్రాండ్‌గా ఈ సినిమాను నందమూరి అభిమానుల ముందుకు తేవాలని కొరటాల గట్టిగానే ఫిక్సయ్యారట.

koratala siva Master plan for NTR 30

యువ సుధ ఆర్ట్స్ మరియు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఏప్రిల్ 29, 2022 కి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY