Sarkaru Vaari Paata లో పోలీస్‌గా అర్జున్..?

Sarkaru Vaari Paata Arjun: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట లో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తున్నారని టాక్ ఉన్న సంగతి తెలిసిందే.

సర్కారు వారి పాట బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో కొత్త షెడ్యూల్ మొదలవబోతోంది.

అయితే ఈ చిత్రంలో తన రోల్ మొదట విలన్ గా ఉంటుంది టాక్ వచ్చింది. ఇప్పుడు ఇదే రోల్ పై మరో టాక్ వినబడుతుంది. దాని ప్రకారం ఈ చిత్రంలో అర్జున్ పోలీస్ పాత్రలో కనిపిస్తారట.

త్వరలో దీనిపై మరింత క్లారిటీ రానుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles