ఫైనల్ షూట్ లో నాని శ్యామ్ సింఘ రాయ్..!

1458
Latest Shooting update on Nani Shyam Singha Roy

సహజ సిద్ధమైన నటనతో పాటు అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకుంటూ ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు నాని. కొన్నాళ్ల పాటు వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటిన అతడు.. ఈ మధ్య కాలంలో పెద్దగా రాణించలేకపోతున్నారు. దీంతో ఒక దాని తర్వాత ఒకటి అలా సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు ‘శ్యామ్ సింఘ రాయ్’ అనే సినిమాను చేస్తున్నాడు.

నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింఘ రాయ్’ సినిమా క్లైమాక్స్ ను హైదరాబాద్ లోని అల్యుమినియమ్ ఫ్యాక్టరీలో వేసిన పాతతరం కలకత్తా నేపథ్యం సెట్ లో షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి గతంలోనే ఈ సీక్వెన్స్ షూట్ చేసినా.. కొంత ప్యాచ్ వర్క్ కారణంగా మళ్ళీ రీషూట్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం క్రేజీ బ్యూటీ సాయి పల్లవిని తీసుకోబోతున్నారని.. సాయి పల్లవి రోల్ కీలకం అని తెలుస్తోంది.

ఈ సినిమా కథే కాస్త ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా సినిమా వుంటుందని.. ముఖ్యంగా పాత కలకత్తా లుక్ కావాల్సి వుందని తెలుస్తోంది. నాని మొదటి నుండి ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పడానికి.. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.. అందుకే మన రచయితలూ, దర్శకులు కూడా నాని కోసం కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు.