పూజా క్యారెక్టర్ రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్

0
458

Pooja Hegde First Look Radhe Shyam: ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘రాధేశ్యామ్’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే క్యారెక్టర్ రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న బుట్టబొమ్మకు అరుదైన కానుకలు అందాయి. అందులో ఒకటి డార్లింగ్ ప్రభాస్ ఇచ్చినది. ఇంకొకటి అక్కినేని అఖిల్ ఇచ్చినది.

చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో పూజా క్యారెక్టర్ చాలా కీలకం అని, అలాగే ఆమె గ్లామర్ డోస్ చిత్రానికి మేజర్ అట్రాక్షన్ అవుతుందని విన్నాం. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు (అక్టోబర్ 13) పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇందులో పూజా క్యారెక్టర్ పేరు రివీల్ చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రానికి జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్స్ – గోపికృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సందర్భంగా రాధేశ్యామ్ నుంచి పూజా లుక్ ని లాంచ్ చేసింది చిత్రబృందం. హ్యాపీ బర్త్ డే ప్రేరణ అంటూ అదిరిపోయే గిఫ్ట్ నే ఇచ్చారు. ఇక ప్రేరణ యూరప్ దేశంలో ఠీవిగా కాఫీ షాప్ లో 23 వ నంబర్ బెంచీ మీద కూచుని ప్రియుడితో ఎంచక్కా మాట్లాడుతోంది. గుసగుసగా నవ్వులు చిందిస్తోంది. కాగా ఈ మూవీలో పూజ హెగ్డే ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ క్యారెక్టర్‌లో గ్లామర్ డోస్‌తో ఆకట్టుకుంటూ, మరో క్యారెక్టర్‌లో తనదైన అభినయంతో కట్టిపడేయనుందని టాక్.

Pooja Hegde first look poster from Prabhas Radhe Shyam movie

1960 దశకం నాటి ప్రేమకథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ ‘రాధే శ్యామ్’ మూవీ రూపొందుతోంది. ప్ర‌భాస్ 20వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. 2020 ఈ బుట్టబొమ్మకు మాత్రం అద్భుతంగా కలిసొచ్చింది. అల రూపంలో బంపర్ హిట్ కొట్టి ఇప్పుడు అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటిస్తోంది. వేరే సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉంది.

Previous articleAdipurush లో మరో బాలీవుడ్ హీరో!
Next articlePooja Hegde First Look Poster From Prabhas Radhe Shyam