“పుష్ప” సెకండ్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

0
1087
Latest Update on Allu Arjun Pushpa Second Single

Pushpa Second Song: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప‌’. అటవీ బ్యాక్‌డ్రాప్‌లో ఎర్ర చందనం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పుష్ప నుంచి విడుదలై టీజర్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టున్నాయి.

ఈ చిత్రం నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ వచ్చి భారీ రెస్పాన్స్ ని అందుకొని ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ పై  ఇంట్రెస్టింగ్ ఇన్ఫో వినిపిస్తుంది. మరి దాని ప్రకారం ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ గా ఒక డ్యూయెట్ ని రిలీజ్ చెయ్యనున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్.

Latest Update on Allu Arjun Pushpa Second Single

ఇప్పటికే బన్నీ, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ల ఆల్బమ్ అంటే అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. మరి వాటిని మ్యాచ్ చేసే విధంగా ఫుల్ ఆల్బమ్ వస్తుంది అని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. అది అలా ఉంటే ఈ సినిమా మొదటి భాగం క్రిస్మస్ సందర్భంగా విడుదలకానుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.