Guntur Kaaram Shooting update: మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా వస్తున్న విషయం తెలిసిందే. గత ఆరు నెలల గా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ కేవలం 20% సినిమా పూర్తి అయినట్టు తెలుస్తుంది. నటీనటుల మార్పు ఆ తర్వాత మహేష్ బాబు వెకేషన్ కి వెళ్ళటం దీనితోపాటు త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో మార్పులు చేయటం వల్ల షూటింగు లేట్ అవ్వడం జరిగింది.
Guntur Kaaram Shooting update: వీటన్నిటి తర్వాత మహేష్ బాబు ఈ సినిమాకి పనిచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సంగీతం పై సంతృప్తిగా లేరు అంటూ రుమోర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే రీసెంట్గా తమ అందించిన టైటిల్ సాంగ్ మ్యూజిక్ ని మహేష్ బాబు కన్ఫామ్ చేశాడు అనే న్యూస్ బయటికి రావటంతో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడటం జరిగింది. ఈ సాంగ్ ని ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు.
దీనితోపాటు రీసెంట్ గా మీడియా సమావేశంలో మహేష్ బాబు ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందని కన్ఫామ్ చేయడంతో పుకార్లు అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా జరుగుతుంది మహేష్ బాబు కూడా ఈ సినిమా కావాల్సిన డేట్స్ ని ఇవ్వటంతో త్రివిక్రమ్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ జరుగుతూ సంక్రాంతికి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.
అందుతున్న లేటెస్ట్ సమాచారం మేరకు మహేష్ బాబు ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన గుంటూరు కారం (Guntur Kaaram) రెండవ సాంగ్ (Second Song) ట్రాక్ ని మహేష్ ఓకే చేసినట్టు ఫిలిం సర్కిల్లో టాక్ వినబడుతుంది. మెలోడీ సాంగ్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు రెండు సాంగ్స్ మూవీలో ఫైనల్ అయ్యాయి.
ఈ సినిమాలో వస్తున్న సాంగ్స్ గురించి మహేష్ బాబు బాగానే కేర్ తీసుకుంటున్నారు అందుకనే తమన్ అందించిన ప్రతి ఒక్క ట్రాక్ ని మహేష్ బాబు ఓకే చేసిన తర్వాతే త్రివిక్రమ్ కూడా ఓకే చేస్తున్నారంట. మిగతా సాంగ్స్ కూడా తమన్ బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. శ్రీ లేదా అలాగే మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రొడ్యూసర్స్.