Pushpa 2 The Rule Shooting update, Allu Arjun, Rashmika Mandanna, Pushpa 2 Shooting Location, Pushpa 2 latest news, Pushpa 2 songs news, Allu Arjun New movie
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 సినిమా భారీ అంచనాలతో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా నార్త్ సైడ్ ప్రేక్షకులు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత భారీ విజయం సాధించడమే కాకుండా అల్లు అర్జున్ కూడా ఈ సినిమాతో జాతీయ అవార్డు కైవసం చేసుకున్నారు. చాలామంది మూవీ లవర్స్ పుష్ప 2 సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది అంటూ ఆరా తీస్తున్నారు.
పుష్ప సినిమా భారీగా విజయం సాధించడంతో దర్శకుడు సుకుమార్ అలాగే యూనిట్ పై భారీగా ఒత్తిడి పెరగడం జరిగింది. ఇప్పుడు అందరూ పుష్పా కంటే భారీ విజయం పుష్ప 2 తో అందించాలని ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే మరో జాతీయ అవార్డు తెచ్చుకునే విధంగా ఈ సినిమా కోసం తన పర్ఫామెన్స్ ఎక్కడ తగ్గ కూడా కష్టపడుతున్నట్టు సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు .
ప్రస్తుతం పుష్ప 2 రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ అల్లు అర్జున్ పడుతున్న కష్టం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సమాచారం మేరకు రామోజీ ఫిలిం సిటీ లో జాతర సమావేశాలకు సంబంధించిన షూటింగు ప్రస్తుతం కొనసాగుతుందంట. జాతరకు సంబంధించిన విజువల్స్ బాగా వచ్చాయి అంటూ.. ఒక సాంగ్ అలాగే ఒక ఫైటింగ్ కూడా కంపోజ్ చేశారంటూ సమాచారమైతే తెలుస్తుంది. సినిమా లో ఈ సన్నివేశాలు హైలెట్గా ఉంటాయని చెబుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ కోసం బన్నీ కి దాదాపు రెండు గంటల సమయం టైం పడుతుంది అంట..పోతురాజు గెటప్ తో సాధారణంగా నటించడమే గొప్ప విషయం. అలాంటిది ఏకంగా డాన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయట.. ఇక ఈ జాతర సన్నివేశాలు కనుక పూర్తిగా అయితే దాదాపు 65% షూటింగు పూర్తి అయినట్టే అంటున్నారు. రష్మిక హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆగస్టు 15న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.