RRR: రిలీజ్ డేట్ పై మళ్లీ కన్ఫ్యూజన్..?

0
1939
NTR and Ram charan RRR movie new release date

RRR Release date: ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి అభిమానులకు ఆర్ఆర్ఆర్ (RRR) రిలీజ్ డేట్ విషయంలో రాజమౌళి మరో బిగ్ షాక్ ఇవ్వనున్నారా.. అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు యోధులు అల్లూరి సీతరామ రాజు, కొమరం భీమ్‌లు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే ఊహతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలు, ప్యాచ్ వర్క్ షూటింగ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు ఉక్రెయిన్‌ నుంచి ఆర్ఆర్ఆర్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అందిస్తున్నారు. ఈ నెలాఖరుకు ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమాను వచ్చే యేడాది.. జనవరి 26న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ తేది అన్ని విధాలుగా తగినదిగా రాజమౌళి భావిస్తున్నట్టు సమాచారం. త్వరలో ఆర్ఆర్ఆర్ కొత్త విడుదల తేదిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా హిందీ, తమిళంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వాళ్ల పాత్రలకు వాళ్లే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.

 

Previous articleRC15: శంకర్ రామ్ చరణ్ సినిమాలో మరో హీరోయిన్..!
Next articleతన పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన శ్రీముఖి..!