Ram Charan and NTR RRR Sequel Update: రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా వచ్చిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా.. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావటమే కాకుండా మరికొన్ని అవార్డులు కూడా వచ్చాయి. అలాగే సినిమాలో నటించిన ఇద్దరి హీరోలకు గ్లోబల్ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆర్‌ఆర్‌ఆర్ సీక్వెల్ ఉంది అంటూ దర్శకుడు అలాగే కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పేది విషయం అందరికీ తెలిసిందే.
Ram Charan and NTR RRR Sequel Update: అయితే ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి మహేష్ బాబుతో చనిపోయే SSMB29 సినిమా స్క్రిప్ట్ అలాగే ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. రచయిత విజయేంద్రప్రసాద్ ఆర్‌ఆర్‌ఆర్ మూవీస్ సీక్వెల్ ప్రకటించగానే మహేష్ బాబు (Mahesh Babu) సినిమా అయిపోయిన వెంటనే దర్శకుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సీక్వెల్ సినిమాకు సంబంధించిన వర్కు బిగించేస్తారని అందరూ భావించారు. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.
మహేష్ బాబు సినిమా పూర్తి కాగానే రాజమౌళి మహాభారతం సంబంధించిన సినిమా అన్ని తర్కెక్కిస్తున్నట్టు విజయేంద్ర ప్రసాద్ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం జరిగింది. దీనితో ఆర్‌ఆర్‌ఆర్ సీక్వెల్ (RRR Sequel) సినిమా ఎప్పుడు వస్తుందంటూ ఫాన్స్ అలాగే మూవీ లవర్స్ డౌట్ లో ఉండిపోయారు. కానీ అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించటం లేదు..

ఈ మూవీకి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. దర్శకుడు చంద్రశేఖర్ విభిన్న చిత్రాల తీగలిగిన సమర్థవంతుడు. ఆయన దర్శకత్వంలో సీక్వెల్ ఏంటా అంటూ చాలా మంది నోరు వెళ్లబెడుతున్నారు.
మరి ఈ కథనాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఆర్‌ఆర్‌ఆర్ సీక్వెల్ దర్శకుడుగా చంద్రశేఖర్ యేలేటి అనే పేరు మాత్రం వినపడుతుంది. అలాగే ఇప్పుడు ఒకవేళ చంద్రశేఖర్ దర్శకత్వం వహించేటట్టు అయితే జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఉంటారా లేదు అంటే వేరే హీరోయిన్ పెడతారా అనే సందేహం కూడా కలుగుతుంది. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా ఈ సినిమాపై చర్చ జరుగుతుంది. దీనిపై ఎప్పటికీ క్లారిటీ వస్తుందో చూడాలి.