Latest News On Prabhas Salaar Villain Role: ప్రభాస్ వరుస భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఆదిపురుష మూవీ రిలీజ్ కాగా దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 AD అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ముందుగా సలార్ సినిమా సెప్టెంబర్ లో విడుదల చేయుటకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. సలార్ సినిమాని రెండో భాగాలుగా తీస్తున్న విషయం తెలిసింది. అయితే దీనిలో ఇద్దరు విలన్స్ ఉంటారని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Latest News On Prabhas Salaar Villain Role: సలార్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ టీజర్ తో ప్రారంభించారు మేకర్స్. సలార్ టీజర్ కి ఆడియన్స్ నుండి అలాగే మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ప్రభాస్ మాస్ లుక్ ఫాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు దర్శకుడు. ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ పృద్విరాజ్ సుకుమారం విధంగా చేస్తున్న విషయం తెలిసిందే, అయితే ఇతనితోపాటు బాలీవుడ్ హీరో కూడా విలన్ రోజు చేస్తున్నట్టు సమాచారం అయితే అందుతుంది.
ఇక విషయంలోకి వెళ్తే, సలార్ విలన్ రోల్ కోసం పృధ్విరాజ్ సుకుమారం అలాగే బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్ర హీరోలతో పోటీ పడుతూ మంచి పాత్రలు చేస్తూ నటుడిగా రాణిస్తున్నారు. సలార్ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్ పాత్ర ఎలా ఉండబోతుందో మరి కొన్ని రోజుల్లో తెలుస్తుందని ఫిలింనగర్ లో టాక్ వినబడుతుంది.

సలార్ సినిమాలు జగపతిబాబు అలాగే శృతిహాసన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా దర్శకుడు ప్రభాస్ ని ఈ సినిమాలో సరికొత్త మా లుక్ తో చూపించబోతున్నారనేది మనకు టీజర్ తోనే అర్థమైంది. ఇక ఈ పాన్ ఇండియా సినిమా పై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా ఫాన్స్ అంచనాలకు అందే విధంగా చిత్రకరణ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమాని విడుదల చేయుటకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.