Niharika Divorce – Varun Tej Lavanya Marriage condition: మెగా ఫ్యామిలీలో ఒకవైపు రామ్ చరణ్ అలాగే ఉపాసన దంపతులకు పాప పుట్టటం మరోవైపు వరుణ్ తేజ్ లావణ్య మ్యారేజ్ ఫిక్స్ అవ్వటంతో మెగా కుటుంబమే కాకుండా మెగా ఫ్యాన్స్ కూడా ఆనందంలో తేలిపోయారు. కానీ అనుకోని విధంగా నిహారిక కొనిధుల అలాగే చైతన్య జొన్నలగడ్డ పెళ్లయిన రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. అందరూ ఉన్న టైంలో ఇలా జరగటం మెగా అభిమానుల్ని కలిసి వేసింది.
Niharika Divorce – Varun Tej Lavanya Marriage condition: ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న నిహారిక అలాగే చైతన్య విడాకులను రూమర్స్ కింద కొట్టు వేశారు మెగా ఫ్యాన్స్ అయితే కొన్ని రోజులు క్రితం నిహారిక అలాగే చైతన్య తమ సోషల్ మీడియా ద్వారా ఈ రూమర్స్ ని నిజం చేయడం జరిగింది. ఇది తెలుసుకున్న లావణ్య త్రిపాఠి తల్లి కాబోయే అల్లుడు వరుణ్ తేజ్ కి కొత్త కండిషన్స్ పెట్టడం జరిగిందంటూ సోషల్ మీడియాలో కథనాలు నడుస్తున్నాయి.
ఇక అసలు విషయానికి వెళ్తే లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) వరుణ్ తేజ్ (Varun Tej) ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న విషయము ఒక రూమర్లగా సోషల్ మీడియాలో కథనాలుగా నడిచాయి కానీ నెలరోజుల క్రితం ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరగటంతో మెగా అభిమానులే కాకుండా మూవీ లవర్స్ కూడా సంతోషించారు. ఇప్పుడు నిహారిక విడాకులు తీసుకోవడంతో లావణ్య త్రిపాఠి తల్లి (Lavanya Mother) తన కూతురి జీవితం కూడా రాబోయే రోజుల్లో ఇలా జరగకూడదు అని వరుణ్ తేజ్ ఒక కండిషన్ ఒప్పుకుంటేనే మ్యారేజ్ కి సిద్ధమైనట్టు తెలుస్తుంది.
ఆ కండిషన్ ఏమిటంటే లావణ్య అలాగే వరుణ్ తేజ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు వేరు కాపురం ఉండాలని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిహారిక ని కలవకూడదు అంటూ గట్టిగా చెప్పినట్టు సోషల్ మీడియాలో కథనాలు నడుస్తున్నాయి. దీనికి మెగా అభిమానులు వేరే కాపురం అయితే పరవాలేదు అంటూ సొంత చెల్లిని కలవకుండా ఉండటం ఎలా అనే విషయంలో మండి పడుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.