legal Notices to Kantara movie team: రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార మూవీ సెన్సేషన్ హిట్ గా మారింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టించింది. కంటెంటు బాగుంటే చాలు సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారనే దానికి ఈ సినిమా కూడా ఉదాహరణ. అయితే ఇప్పుడు కాంతార మూవీ టీం కి కొత్త చిక్కులు తప్పటం లేదు.
Thaikkudam Bridge legal notice to Kantara team: కాంతార సినిమా నుండి రీసెంట్ గా విడుదలైన ‘వరాహ రూపం’ సాంగ్ సినిమాలో చివరి పదిహేను నిమిషాలు వచ్చే క్లైమాక్స్ లో వస్తుంది. అయితే ఈ సాంగు తమ ‘నవరస’కు కాపీ అని ‘తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేసింది.
దీనికి సంబంధించి ఈ బ్యాండ్ వారు సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ ని విడుదల చేయడం జరిగింది. తమకు మద్ధతు తెలపాలని సోషల్ మీడియా యూజర్స్ ని కోరింది.

ఈ కాపీకి కారణమైన వాళ్లపై మేం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం’ అని తైక్కుడం బ్రిడ్జ్ పేర్కొంది. ఈ పోస్టులో కాంతార సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్, దర్శకుడు రిషబ్ శెట్టి, ప్రొడ్యూసర్స్ విజయ్ కిరంగదూర్ లని ట్యాగ్ చేసింది.
అయితే ఈ బ్యాండ్ వారు చేసిన ఆరోపణలపై రిషబ్ శెట్టి కానీ అలాగే ప్రొడ్యూసర్స్ కానీ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. మరి రాబోయే రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చిందేమో చూడాలి.
View this post on Instagram