legendary singer sp balasubrahmanyam health condition once again critical

sp balasubrahmanyam health: ఎస్పీ బాలు ఆరోగ్యం విషమించడం గందరగోళాన్ని సృష్టిస్తుంది. నిన్నటి వరకు కోలుకుంటున్నారనుకున్న బాలు . తిరిగి అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెన్నై ఎంజీఎం హాస్పిటల్ గురువారం సాయంత్రం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటలుగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. ఆయనకి ఎక్మో, ఇతర లైఫ్ సపోర్ట్‌పై చికిత్స అందిస్తున్నామని హాస్పిటల్ పేర్కొంది.

ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రోజూ ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తున్నారు. అదేవిధంగా రోజూ తండ్రి ఆరోగ్య పరిస్థితి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియా వేదికగా వివరిస్తున్నారు..

SP Balasubrahmanyam health update

బాలసుబ్రహ్మణ్యం కోసం భగవంతుడిని ప్రార్థించాలని, ఈ సమయంలో అందరి ప్రార్థనలు ఆయనకు అవసరమైని, బాలు త్వరగా కోలుకోవాలని సంగీత దర్శకుడు ఎస్.తమన్ ట్వీట్ చేశారు. ఎంజీఎం హాస్పిటల్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేయడానికి ముందే తమన్ ఈ ట్వీట్ చేశారు. బాలు ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. అయినప్పటికీ ఆయన ఊపిరితిత్తుల పనితీరు బాగాలేదని సమాచారం.