Homeసినిమా వార్తలువిజయ్ లియో తెలుగు థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన ‘సితార’.

విజయ్ లియో తెలుగు థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన ‘సితార’.

Vijay Leo telugu rights, Leo Theatrical rights bought by Sithara Entertainments, Leo Movie, Vijay Thalapthy, Lokesh Kanagaraj, Leo Movie Telugu Theatrical rights, LEO Movie Release Date.

దళపతి విజయ్ మరియు సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతోన్న భారీ అంచనాలు కలిగిన చిత్రం ‘లియో’లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భాగస్వాములు కాబోతున్నారు. ఈ చిత్రంలో దళపతి విజయ్, త్రిష కృష్ణన్, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవలే లియో చిత్ర బృందం షూటింగ్‌ను పూర్తి చేసింది. దాదాపు 125 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. కాశ్మీర్‌, చెన్నై నగరాల్లో ప్రధానంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రాఫర్ ద్వయం అన్బరివ్ మాస్టర్స్‌ సమకూర్చిన యాక్షన్ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని చిత్రం బృందం చెబుతోంది.

లియో సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ రంగంలోకి అడుగుపెట్టాలని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్ణయించుకుంది. తెలుగు రాష్ట్రాల హక్కులు 19 కోట్లకు కొనుగోలు చేసినటు ట్రేడ్ వర్గాల రిపోర్ట్. ఆంధ్ర 9 నుంచి 10 కోట్లు. సీడెడ్ 4 కోట్లు, నైజాం 5 కోట్లు వుండే అవకాశం. ఈ లెక్కన వైజాగ్ ఏరియా 3 కోట్ల వరకు వుంటుంది. ఇలాంటి సంచలన సినిమాతో పంపిణీ రంగంలోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉందని, దళపతి విజయ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన మార్కెట్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తెలుగులో ఆయన చిత్రాలకు మునుపెన్నడూ లేని విధంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నామని సితార సంస్థ పేర్కొంది.

అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లోకేష్ కనగరాజ్, అనిరుధ్ కలయికలో ఇది హ్యాట్రిక్ సినిమాగా నిలవనుంది. ఇప్పటికే దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ కలయికలో ‘మాస్టర్’ లాంటి సంచలన ఆడియో వచ్చింది. అదే స్థాయిలో దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా ‘లియో’ నుంచి విడుదలైన ‘నా రెడీ’ అనే మొదటి పాటకు విశేష స్పందన లభించింది.

Vijay Leo telugu rights
Vijay Leo telugu rights

ఎన్నో ఆసక్తికర అంశాలు, హంగులతో రూపుదిద్దుకుంటున్న ‘లియో’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2023 అక్టోబర్ 19న విడుదలవుతోంది. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొంది ప్రశంసలు పొందిన ‘మాస్టర్‌’ చిత్రాన్ని నిర్మించిన ఎస్.ఎస్. లలిత్ కుమార్ ‘లియో’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్టర్ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన జగదీష్ పళనిసామి ఈ యాక్షన్ బొనాంజాకు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Vijay Leo telugu rights, Leo Theatrical rights bought by Sithara Entertainments, Leo Movie, Vijay Thalapthy, Lokesh Kanagaraj, Leo Movie Telugu Theatrical rights, LEO Movie Release Date.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY