Life Threat Phone Calls To Actor Jagapathi Babu Brother Ugendra Kumar

Jagapathi Babu Brother:  సినీ నటుడు జగపతి బాబు సోదరుడు యుగేంద్ర కుమార్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఒక స్థలం విషయంలో తనను చంపేస్తానని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయని బంజారాహిల్స్ పోలీసులకు యుగేంద్ర ఫిర్యాదు చేశారు. భూమాయ.. జంతర్ మంతర్ భూతగాదాల గురించి చెప్పాల్సిన పనే లేదు.మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటలో ఉన్న స్థలం విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని యుగేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ బెదిరింపుల వెనుక బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానం పోలీసుల ఎదుట వ్యక్తం చేశారట. తనతో పాటు తన కుమారుడిని కూడా చంపేస్తామని బెదిరించినట్టు పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం యుగేంద్ర కుటుంబం ఫిలింనగర్‌లో నివాసం ఉంటోంది.