RC15: రాంచరణ్, శంకర్ సినిమాకు లైన్ క్లియర్..!

0
882
Line clear for Shankar Ram Charan RC15 film shooting

Ram Charan Shankar Movie: భారతదేశం గర్వించదగ్గ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ మీద ఈమధ్య వరసగా ఇబ్బందుల్లో పడుతున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 చిత్రం ప్రారంభించినప్పటి నుంచి అనేక చిక్కులు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ కు అడుగడుగునా అడ్డంకులే తగులుతున్నాయి. నిర్మాతలు శంకర్ మీద కేసులు వెయ్యడం ఇలా ఆయనకి చాలా తలనొప్పులు వచ్చాయి. శంకర్ ఇప్పటికే రామ్ చరణ్ తో RC15 ఒక సినిమా ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ ఫినిష్ కాగానే ఈ క్రేజీ కాంబోలో చిత్రం మొదలవుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇండియన్ 2 చిత్ర నిర్మాతలు లైకా సంస్థ శంకర్ పై హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శంకర్ కి ఆ కేస్ లో విముక్తి లభించినట్టే ఉంది. ఈ సినిమా పూర్తి కాకుండా ఏ సినిమా మొదలుపెట్టడానికి వీలు లేదు అని చెప్పిన భారతీయుడు 2 సినిమా నిర్మాతలుకి కోర్ట్ ఇచ్చినా తీర్పు కొంచెం షాక్ ని ఇచ్చింది.

శంకర్ మరో సినిమా చేయకుండా అడ్డుకోవాలని లైకా సంస్థ వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. అలా అడ్డుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. కోర్టు ప్రకటనతో శంకర్, రాంచరణ్ ల చిత్రానికి లైన్ క్లియర్ అయినట్లు అయింది. ఈ చిత్రం సెప్టెంబర్ లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.