ప్రభాస్ ప్రస్తుతం వరుస ఫ్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. రీసెంట్గా ఆది పురుష సినిమా విడుదలైన తర్వాత బాలీవుడ్ దర్శకులతో సినిమాలు తీసే విషయంలో కూడా సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత కల్కి సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితోపాటు సలార్ మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లోకి రాబోతుంది.
ఇప్పుడు ఇవే కాకుండా దర్శకుడు మారుతి ప్రాజెక్టు ఒకటి అలాగే దీని తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో కూడా స్పిరిట్ అనే సినిమా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే వీటితో పాటు దర్శకుడు హను రాఘవపుడితో కూడా సినిమా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు నడుస్తున్నాయి. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో మరికొన్ని డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు తీసే అవకాశాలు ఉన్నాయి.
అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు, ఈ లిస్టులోకి యంగ్ టాలెంటెడ్ దర్శకుడు వచ్చినట్టు తెలుస్తుంది. కమలహాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ పాస్టర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj) కాంబినేషన్లో ప్రభాస్ (Prabhas) మూవీ ఉంటుందంటూ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు ఫిలింనగర్ లో టాక్ మీద పడుతుంది .
మైత్రి మూవీ మేకర్స్ తో ప్రభాస్ ఒక సినిమా చేసే విధంగా అంతకుముందే డీల్ కుదిరింది, ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంతో కూడా కొన్ని కథలపై చర్చలు జరిపారు. ఆదిపురుష సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో ఈ సినిమాను కూడా ప్రభాస్ పక్కన పెట్టినట్టు వార్తలు అయితే వినపడుతున్నాయి. అందుకనే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వారు లోకేష్ తో సినిమాని సెట్ చేసినట్టు తెలుస్తుంది.

ఇక లోకేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తలపతి విజయ్ లియో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాని దసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. లోకేష్ ప్రత్యేకంగా మల్టీవర్స్ కదలని చేయబోతున్నట్లు ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు లోకేష్ లిస్టులోకి ప్రభాస్ కూడా జాయిన్ అవ్వటం ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో లోకేషన్… రజనీకాంత్, రామ్ చరణ్ అలాగే సూర్య లతో సినిమాలు తీయాలని ఆలోచన ఉన్నట్టు చెప్పటం కూడా జరిగింది. మరి లోకేష్ ప్రభాస్ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తాడో చూడండి .