మహేశ్ బాబు పై “సాయిపల్లవి” హాట్ కామెంట్స్..!

1656
Love Story Actress Sai pallavi hot comments on Mahesh Babu Skin

టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే మహేశ్ బాబు అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు.మహేశ్ బాబు కి వయసు 45 సంవత్సరాలు వచ్చిన 25 సంవత్సరాల కుర్రాడిలా కనిపించడం ఒక్క మహేశ్ బాబు కు మాత్రమే సొంతం. ఎప్పుడూ కూల్ అండ్ స్వీట్‌గా ఉండే సాయి పల్లవి సడెన్‌గా హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఆమె కామెంట్ చేయడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. రీసెంట్ ఇంటర్వ్యూల్లో సాయి పల్లవి.. ఎన్నో విషయాలపై ఓపెన్ అవుతోంది.

మహేశ్ నటనకే కాక తన అందానికి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయన ఆయన అందం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మహేష్ అంటే తనకెంతో ఇష్టమంటూ ఆయన అందానికి ఎప్పుడో ఫిదా అయ్యాయని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అంతేకాదు మహేష్ చర్మ సౌందర్యం సూపర్ అంటూ తెగ పొగిడేసింది. మహేష్ బాబు ఫోటో కనిపిస్తే చాలు జూమ్ చేసి మరీ చూస్తుంటానని, చర్మంపై ఒక్క మచ్చ కూడా లేకపోవడం చూసి ఆశ్చర్యపోతుంటానని తెలిపింది. మహేశ్ బాబు అందానికి తాను పెద్ద ఫ్యాన్ అంటూ ప్రశంసలు కురిపించింది. ఆయన చర్మంపై చిన్న మచ్చ కూడా ఉండక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తి ఇంత పరిపూర్ణంగా కనిపించడం అసాధ్యమని ఆయన ఫొటోలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది.

ప్రస్తుతం తెలుగులో రానా సరసన ‘విరాటపర్వం’ మూవీలో నటిస్తోంది సాయిప‌ల్ల‌వి. అలాగే నాగ చైతన్య లవ్ స్టోరీ లో చేస్తుంది. అతి త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక త‌మిళంలో ‘పావ‌క‌థైగ‌ల్’ అనే వెబ్‌సిరీస్‌లో ఆమె న‌టించింది. నాలుగు క‌థ‌లుగా రాబోతున్న ఈ వెబ్‌సిరీస్‌ ఒక కథలో సాయి పల్లవి కనిపించనుంది. డిసెంబర్ 18న ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది.