ఏప్రిల్ 16న నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమా

0
140
love-story-movie-release-on-april-16th
love-story-movie-release-on-april-16th

అక్కినేని హీరో నాగచైతన్య, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథగా రూపొందింది. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాట ప్రోమోలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అనుకున్న స్థాయికంటే ఎక్కువగానే ఆకర్షించాయి. అంతేకాకుండా ఇటీవల విడుదలైన టీజర్ అభిమానులను మరింతగా ఊరించింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు.

 

 

 

ఈ సినిమాను ఏప్రిల్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఓవర్‌సీస్ హక్కులను ఆరున్నర కోట్లకు విక్రయించారు. దాంతో అక్కడ కూడా మార్కెట్ పూర్తి స్థాయిలో తెరుచుకునేంతవరకు సినిమా విడుదల కాదని భావించారు.  అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న నాగశౌర్య సినిమా కూడా ఏప్రిల్‌లోనే విడుదల అయ్యేందుకు సిద్దమవుతోంది. కేవలం రెండు వారాల వ్యవధిలో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాతో పాటు నాచురల్ స్టార్ నాని నటిస్తున్న టక్ జగదీష్ కూడా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటి చేశారు. అయితే చివరకు నానీ సినిమా వెనక్కు తగ్గింది. అయితే టక్ జగదీష్ రిలీజ్ డేట్ ఫిక్స్ కవాల్సి ఉంది.

Previous articleఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ‘మాస్టర్’
Next articleఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్