విడుదలైన ‘లవ్ స్టోరీ’ టీజర్ – ఏందిరా వదిలేస్తావా నన్ను

1351
విడుదలైన 'లవ్ స్టోరీ' టీజర్ - ఏందిరా వదిలేస్తావా నన్ను
విడుదలైన 'లవ్ స్టోరీ' టీజర్ - ఏందిరా వదిలేస్తావా నన్ను

ప్లెజంట్ ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో ఆహ్లాదకర సినిమా ”లవ్ స్టోరి”. ఈ అందమైన ప్రేమ కథలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.‘‘ఫిదా’’ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమాకావడం.నాగ చైతన్య,సాయి పల్లవి లాంటి స్టార్ కాస్టింగ్ ఉండటం ఈ ఎక్స్ పెక్టేషన్స్ కు కారణం.ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ ,ఏయ్ పిల్లా అనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. షూటింగ్ అంతా కంప్లీట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరుపుకుంటుంది.

 

 

ఇక ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ అప్ డేట్ రానే వచ్చింది. ఉదయం 10:08 గం.లకు ‘‘లవ్ స్టోరీ’’ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.