విరాట పర్వం నుంచి సాయి పల్లవి ‘కోలు కోలు’ పాట

371
Rana Sai Pallavi Kolu Kolu Song with Lyrical video from Virata Parvam

దగ్గుపాటి రానా, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా విరాట పర్వం. సినిమాను నక్సలైగ్ రవన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో రానా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో సీనియర్ నటి టబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

 

 

ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ‘కోలు  కోలు’ అంటూ సాగనున్న పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ లిరికల్ వీడియో చూస్తుంటే పాట సాయి పల్లవి ప్రధానంగా తెరకెక్కిందని అర్థం అవుతోంది. ఈ సినిమా ఉన్న అంచనాలను ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ తారాస్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.