m. m. keeravani will give music for prabhas adipurush

Prabhas Adipurush Music Director: రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌. రామాయణం కథాంశంతో 3డీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న ఈ సినిమా కోసం పక్కా ప్లాన్స్ వేస్తున్నారు. నటీనటులు మొదలుకొని సాంకేతిక వర్గం వరకు అన్నింటా స్పెషల్ పర్సన్స్‌ని తీసుకోవాలని చూస్తున్నారు.

దాదాపు రూ.500కోట్లతో టీసిరిస్ నిర్మించనున్నా ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. మిగిలిన పాత్రాధారులకు సంబంధించిన ఎంపిక ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనుకుంటోన్న దర్శకనిర్మాతలు అందుకు తగ్గట్లుగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వేగాన్ని పెంచారు.

ఈ క్రమంలో పౌరాణిక చిత్రం కాబట్టి సంగీతం సినిమాకే మేజర్ అట్రాక్షన్ కావాలని భావించిన దర్శకనిర్మాతలు.. మొదట ఏఆర్‌ రెహమాన్‌ పేరును పరిశీలించారట. కానీ పలు విధాలుగా చర్చించుకొని చివరకు కీరవాణి అయితేనే పర్ఫెక్ట్ అనే ఆలోచనకు వచ్చారట. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం ప్రభాస్ వర్కౌట్లను ప్రారంభించేశారని దర్శకుడు ఓమ్‌ రౌత్ తెలిపారు. ఈ మూవీకి సంబంధించిన ప్రతి డిస్కషన్‌ ఫోన్‌లో జరుగుతుందని ఆయన అన్నారు.

ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా రానున్న ఈ ‘ఆదిపురుష్’ మూవీని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.