Homeసినిమా వార్తలుఅంతకుమించి అనే రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తున్న మా ఊరి పొలిమేర 2 టీజర్ 

అంతకుమించి అనే రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తున్న మా ఊరి పొలిమేర 2 టీజర్ 

Rajesh Maa Oori Polimera-2 Movie, Maa Oori Polimera-2 Movie Release Date, Maa Oori Polimera-2 Teaser, Maa Oori Polimera-2 cast crew, Maa Oori Polimera-2 Trailer Release Date

Maa Oori Polimera-2 Teaser: ఒకప్పుడు క్షుద్ర పూజలు నేపథ్యంలో వచ్చే చిత్రాలు అంటే ప్రేక్షకులు ఎంతో భయపడేవారు. కానీ ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా ఆద్యంతం మూవీని ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. అందుకే ఇప్పుడు హారర్ స్టోరీస్ కు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10 2021న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన మా ఊరి పొలిమేర చిత్రం ఒకటి.

Maa Oori Polimera-2 Teaser: ఎటువంటి అంచనాలు లేకుండా నేరుగా ఓటీటీ లో విడుదలైన ఈ చిత్రం మంచిగా ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీకి సెకండ్ పార్ట్ ఉంటుంది అని మూవీ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ప్రకటించడం కూడా జరిగింది. క్షుద్ర పూజలతో ,మంత్రాలు తంత్రాల తో పాటు హాట్ బెడ్ రూమ్ సీన్స్ మరియు రొమాంటిక్ సన్నివేశాలతో ఉండే ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

ఎండ్ కార్డ్ వరకు ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తిగా ట్విస్టులతో ఎంటర్టైనింగ్ గా సాగుతుంది ఈ చిత్రం. అయితే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా విడుదలవుతున్న చిత్రానికి సంబంధించిన టీజర్ ను శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్టీ అనుకుంటే రాబోయే సెకండ్ పార్ట్ అంతకుమించి ఉంది అని టీజర్ చూస్తే అర్థమవుతుంది.

డిఫరెంట్ కథా మరియు కథనాలతో సాగే ఈ త్రిల్లర్ లో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, చిత్రం శ్రీను, రవి వర్మ తదితరులు నటించారు. ఈ మూవీ లాస్ట్ ఎండ్ కార్డ్ వరకు రోమాంచితంగా సాగుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. శుక్రవారం నాడు ‘మాఊరి పొలిమేర 2’ టీజర్ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు.

Maa Oori Polimera-2 Movie Teaser Released

ముఖ్యంగా టీజర్ చివరిలో క్షుద్ర పూజలు చేస్తూ తలపై రక్తం పోసుకుంటున్న సత్యం రాజేష్ క్యారెక్టర్ సన్నివేశం చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ కలగాల్సిందే. జూలై చివరిలో లేదా ఆగస్టులో ఈ చిత్రం విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈసారి మూవీ లో హారర్ తో పాటు ఆక్షన్ మరియు కామెడీ సన్నివేశాలు కూడా ఉన్నాయి అన్న హింట్ టీజర్ లో ఇచ్చారు.

Maa Oori Polimera-2 Movie, Maa Oori Polimera-2 Movie Release Date, Maa Oori Polimera-2 Teaser, Maa Oori Polimera-2 cast crew, Maa Oori Polimera-2 Trailer Release Date

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY