Maadhavi Latha Shocking Comments On Drugs Link With Tollywood Celebrities

బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్ర‌గ్స్ వాడుతున్నారంటూ సంచ‌ల‌న న‌టి కంగ‌నా ర‌నౌత్ ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌ను న‌టి, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీల‌త స‌మ‌ర్థించారు. అంతేకాదు టాలీవుడ్‌లోనూ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం న‌డుస్తోందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ అంతా డ్రగ్స్ మత్తులో ఊగిపోతోందని పేర్కొంటూ ఓ పోస్ట్ పెట్టింది.

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని కీలకంగా తీసుకొని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ డీలర్లతో ఆమె చేసిన వాట్సాప్ చాట్ బయటకురావడం సినీ వర్గాల్లో హాట్ ఇష్యూ అయింది. అయితే ఈ ఇష్యూలోకి ఎంటరైన హీరోయిన్ కంగనా రనౌత్.. బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. కానీ డ్రగ్స్ నేరం. ఒక పేదవాడికి అన్నం పెడతారో, లేదో కానీ మాద‌క ద్ర‌వ్యాల కోసం వేల‌కు వేలు పెడతారు. సరే, అది వాళ్ళ ఇష్టం.

భార‌త్‌లో అనుమ‌తి ఉన్నవి తినండి, తాగండి. దేశానికి ఆదాయం పెంచుకుంటే పెంచుకోండి. కానీ ఇతర దేశాల మాద‌క ద్ర‌వ్యాలు ఎందుకు? ఆ మత్తులో జరిగే అరాచకాలు ఎవరూ బయట పెట్టరు. తెలంగాణ‌ ఎన్సీబీ సార్లు.. మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి. డ్ర‌గ్స్ మన ఇండస్ట్రీలో బాగా వాడుకలో ఉంది. ఇక్కడ అది లేకుండా కొన్ని పార్టీలు జరగవు. అని పేర్కొన్న మాధవీలత..

చివరగా ”నాకు భయంగా ఉంది ఈ పోస్ట్ పెట్టాను అని నన్ను ఎవరైనా బెదిరిస్తారేమో అని. ఎవరు డ్రగ్స్ జోలికి పోరు ఆ అధికారులు కూడా చూసి చూడనట్లే ఉంటారు. నిజంగా పట్టుకుంటే వాళ్ళకి భయం.. ఒకవేళ పట్టుకున్నా ప్రభుత్వాలు ఎలాగూ వేదిలెయ్ అని భయపెడతాయి కదా ఆఫీసర్స్‌ని. సరేలే నాకేమన్నా అయితే చట్టం చేతకానితనం అని నేనే కేసు పెట్టాల్సి వస్తుందేమో” అంటూ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులపై సెటైర్స్ వేసింది మాధవీ.