Macherla Fan Walks 200 Km To Meet Allu Arjun

Allu Arjun: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ ఇతర రాష్ట్రాల్లో కూడా బన్నీకి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించిన బన్నీ.. మాచర్లకు చెందిన నాగేశ్వరరావు అనే డైహార్డ్ ఫ్యాన్‌కి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. గంగోత్రి సినిమా నుండి అల్లు అర్జున్ ని ప్రాణం కంటే ఎక్కువగా అభిమానిస్తున్న అభిమాని నాగేశ్వరరావు .

త‌న స్వ‌గ్రామం మాచర్ల గ్రామం కమ్మం పాడు నుండి హైద‌రాబాద్(200కి.మీ దూరం)కు న‌డుస్తూ వ‌స్తున్నాడ‌ని త‌న టీం ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ వెంట‌నే త‌న‌ని ఆపి హైద‌రాబాద్ కి తీసుకురమ్మ‌ని చెప్పారు. అప్ప‌టి నుండి అల్లు అర్జున్ టీం అంతా అత‌ని కాంటాక్ట్ కొసం ప్ర‌యత్నాలు చేస్తూనే వున్నారు. కాని అత‌ని ఆచూకి దొర‌క‌లేదు. చివ‌ర‌కి 6 రోజుల త‌రువాత హైద‌రాబాద్ చేరుకున్న నాగేశ్వరరావుని అల్లు అర్జున్ టీం క‌లిసి నిన్న సాయంత్రం అల్లు అర్జున్ కి క‌లిపించ‌డం జ‌రిగింది.

తనను కలవడం కోసం వచ్చిన ఆ యువకుడ్ని ఇంటి లోపలికి సాదరంగా ఆహ్వానించి చాలాసేపు అతనితో మాట్లాడి ఫొటోలు దిగి పంపించారు అల్లు అర్జున్. సెప్టెంబర్ 17న మాచర్ల నుంచి కాలినడకన పాదయాత్ర ద్వారా బయలుదేరిన యువకుడు.. సెప్టెంబర్ 22న హైదరాబాద్‌కి చేరుకున్నాడు. అప్పటి నుంచి అల్లు అర్జున్‌ని కలవడం కోసం ప్రయత్నిస్తుండగా.. ఎట్టకేలకు అతని కల నెలవేర్చారు అల్లు అర్జున్.