Macherla Niyojakavargam OTT Release Date: నితిన్ పొలిటికల్ డ్రామా మా మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఎడిటర్ రాజశేఖర్ మొదటిసారిగా డైరెక్షన్ చేసిన సినిమా ఇది. కృతి శెట్టి హీరోయిన్ గా చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్.
Macherla Niyojakavargam OTT Release Date: నితిన్ కెరియర్ లోనే మొదటిసారిగా పొలిటికల్ డ్రామా తో వచ్చినా మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్టు 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా అనుకోని విధంగా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. నాలుగు నెలల తర్వాత ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
డిసెంబర్ 9 నుంచి జీ5 ఓటీటీలో మాచర్ల నియోజకవర్గం సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి, సోదరి నిఖితారెడ్డి నిర్మించారు. తమిళ నటుడు సముద్రఖని విలన్‌గా నటించాడు.