‘పుష్ప’లో విలన్ నేను కాదు క్లారిటీ ఇచ్చిన మాధవన్‌
‘పుష్ప’లో విలన్ నేను కాదు క్లారిటీ ఇచ్చిన మాధవన్‌

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌తో సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా పుష్ప తెరకెక్కుతోంది

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌తో లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా పుష్ప తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు చెందిన పలువురిని ఇందులో భాగం చేయాలనుకుంటున్నారు సుకుమార్. ఈ క్రమంలో విలన్‌గా తమిళ ఇండస్ట్రీకి చెందిన విజయ్ సేతుపతిని ఖరారు చేసుకున్నారు. కానీ డేట్లు క్లాష్‌ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి విజయ్ తప్పుకోగా.. ఆ స్థానంలో మాధవన్‌ని తీసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

ఇక వాటిపై తాజాగా స్పందించారు మాధవన్‌. ఇది నిజం కాదంటూ మాధవన్‌ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే అనుష్క సరసన మాధవన్ నిశ్శబ్దంలో నటించగా.. ఈ చిత్రం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీలో అంజలి, షాలిని, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.