ప్రభాస్ ‘సలార్‌’ విలన్‌ ఫిక్స్‌

912
Madhu Guruswamy is the villain in Prabhas and Prashanth Neel's Salaar movie

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‏లో రాబోతున్న సినిమా ‘సలార్’. కేజీఎఫ్-2 మూవీ తర్వాత తాను తెరకెక్కించబోతున్న సినిమా సలార్ అంటూ ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అధికారింగా ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ గోదావరి ఖనిలోని బొగ్గుగనిలో జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఎవరు నటించనున్నారనే విషయంలో గత కొన్నిరోజులుగా పలువురు నటుల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‏కు విలన్‏గా నటించేది ఓ బాలీవుడ్ స్టార్ అంటూ కథనాలు వస్తున్నాయి.

ఈ క్రమంలో తాను ‘సలార్‌’లో నటిస్తున్నానని పేర్కొంటూ కన్నడ నటుడు మధూ గురుస్వామి సోషల్‌మీడియాలో ఇటీవల పోస్ట్‌ పెట్టారు. ‘నా తదుపరి ప్రాజెక్ట్‌ ‘సలార్‌’. నాకెంతో ఆనందాన్ని అందిస్తున్న ఈ విషయం గురించి మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ‘సలార్‌’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందిస్తున్నాను. నాకు ఇలాంటి సువర్ణ అవకాశాన్ని అందించిన దర్శకుడు ప్రశాంత్‌నీల్, నిర్మాత, నిర్మాణ సంస్థలకు ధన్యవాదాలు’ అని ఆయన పోస్ట్‌ పెట్టారు. దీంతో మధూ గురుస్వామి.. ‘సలార్‌’లో విలన్‌గా కనిపించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

శృతి హాసన్ 35వ పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులకు హోంబల్ ప్రొడక్షన్ హౌజ్ వారు కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చారు. మొత్తానికి సలార్ హీరోయిన్ శృతి హాసన్ అని క్లారిటీ ఇచ్చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ సలార్ పై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ అదే టీమ్ తో కలిసి చేస్తున్న సినిమా కాబట్టి యాక్షన్ డోస్ మామూలుగా ఉండదు. ఇక సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.