ఏఆర్ రెహమాన్ కి నోటీసులిచ్చిన మద్రాస్ హైకోర్టు

madras high court gives notice to ar rahman for alleged tax evasion

AR Rahman court notice: ఆస్కార్ విజేత, బహుభాషా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు మద్రాస్ హైకోర్టులో నోటీసులు జారీచేసింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఆదాయపు పన్ను అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యంపై తమకు సమాధానం ఇవ్వాడని ఆయన్ని ఆదేశించింది. ఇన్ కం ట్యాక్స్ అధికారులు 2012 కు సంబంధించిన కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు.

రింగ్‌టోన్లు కంపోజ్ చేసి ఇచ్చేందుకు బ్రిటన్‌కు చెందిన టెలికాం కంపెనీతో రెహమాన్ ఒప్పందం చేసుకున్నారు. ఇందుకోసం రూ.3.47కోట్ల భారీ పారితోషికం తీసుకున్నారు. ఆ మొత్తం అప్పుడు రహ్మాన్ ఖాతాలోకి వచ్చింది. కానీ దానికి సంబంధించిన ట్యాక్స్ ను మాత్రం రెహమాన్ చెల్లించలేదు. దాంతో అప్పటినుండి ఇప్పటివరకు ఆయనకు నోటీసులు పంపిస్తున్నాము అని ఇన్ కం ట్యాక్స్ అధికారులు తెలిపారు.

దీనిపై కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఐటీ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. తన సేవల ద్వారా పొందిన ఆదాయానికి రెహమాన్ పన్ను కట్టకపోవడం నేరమని అన్నారు. తీసుకున్న పారితోషికాని సంబంధించి కట్టకుండా ఎగవేతకు పాల్పడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన మద్రాస్ హైకోర్టు రెహమాన్‌కు శుక్రవారం నోటీసులు జారీచేసింది.