మహేశ్ తో మరోసారి కలిసి నటించనున్నతమన్నా

200
Mahesh Babu and Tamanna to Collaborate again in commericial ad
Mahesh Babu and Tamanna to Collaborate again in commericial ad

‘సరిలేరు నీకెవ్వరు’లో పాటతో మురిపించిన మహేశ్, తమన్నా మరోసారి జోడీ కట్టారు. అంతకు మందు ‘ఆగడు’లో వీరిద్దరూ అభిమానులను మురిపించారు. అయితే ఈ సారి వీరిద్దరూ కలిసేది సినిమా కోసం కాదు. ఓ కమర్షియల్ యాడ్ కోసం.

 

 

ఓ ప్రముఖ పరుపుల కంపెనీ మహేశ్, తమన్నాతో ప్రకటన రూపొందించింది. త్వరలో ఇది ప్రసారం కానుంది. గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత రాబోతున్న ఈ ప్రకటన మహేశ్ అభిమానులతో ఆనందాన్ని నింపుతోంది. ఇందులో మహేశ్ లుక్ కూడా సరికొత్తగా ఉంటుందట.

 

 

తమన్నా ప్రస్తుతం ‘సీటీమార్’, ‘అంధాధున్’ రీమేక్ లో నటిస్తోంది. ఇక మహేశ్ కిట్టీలో ఇప్పటికే పలు బ్రాండ్స్ ఉన్నాయి. బస్ యాడ్, సాఫ్ట్ డ్రింక్, రియల్ ఎస్టేట్, ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ ప్రకటన, ఈ కామర్స్ కంపెనీ, కార్ యాడ్ ఇలా పలు భిన్నమైన ప్రకటన్లో కనిపించిన మహేశ్ కిట్టీలో ఇప్పుడు తొలిసారి పరుపుల కంపనీ ప్రకటన కూడా చేరనుందన్నమాట.