Mahesh Babu Along With His Family in a commercial ad gone viral on social media
Mahesh Babu Along With His Family in a commercial ad gone viral on social media

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక బ్రాండ్‌ను అంబాసిడర్‌గా ఉన్నాడు. అంతేకాదు సినిమా నిర్మాణ రంగంలోనూ తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఏసియన్‌ సంస్థతో కలిసి ఏయంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాడు. ఈ వ్యాపార వ్యవహారాలన్నింటినీ మహేష్ భార్య నమ్రత చూసుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా మహేష్ బాబు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈసారి సదరు సంస్థ కోసం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి యాడ్ చేశాడు.

తాజాగా ఓ యాడ్‌ కోసం సూపర్‌ స్టార్ ఫ్యామిలీ అంతా కలిసి నటించటం హాట్‌ టాపిక్‌గా మారింది. సూర్య డెవలపర్స్ కంపెనీకి చెందిన యాడ్‌లో మహేష్, భార్య నమ్రత, పిల్లలు గౌతమ్‌, సితారలు కూడా నటించారు. ఈ యాడ్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేసిన మహేష్‌, `ఇది మాకు తొలిసారి. ఈ యాడ్‌లో నటించటం ఆనందంగా ఉంది` అంటూ కామెంట్‌ చేశాడు. ఈ యాడ్‌ను అభిమానులు సంబర పడిపోతున్నారు. మరి కొంత మంది అభిమానులు కృష్ణగారు కూడా ఉంటే ఇంకా బాగుండేందంటూ అభిప్రాయపడుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు, అనిల్‌ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు.