మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో SSMB28

0
15
Mahesh Babu with Trivikram Srinivas SSMB28 announcement poster

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత‌డు` 16ఏళ్లుగా, `ఖ‌లేజా` 11ఏళ్లుగా ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. రిపీటెడ్‌గా ఈ ఎవ‌ర్‌గ్రీన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ని చూసి ఎంజాయ్ చేస్తున్నవారంద‌రూ ఈ సూప‌ర్ కాంబినేష‌న్‌లో రాబోయే కొత్త సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

11ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంద‌న్న న్యూస్ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంతో ఆస‌క్తిని రేపుతోంది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజైన మే31న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం అయ్యే ఈ చిత్రం 2022 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ‌వుతుంది.

థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చానున్నారు. దీనికి సంబంధించిన తారాగణం సాంకేతిక నిపుణుల వివరాలు తర్వాత వెల్లడిస్తారు. ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాల‌తో మ‌హేష్-త్రివిక్ర‌మ్‌ల హ్యాట్రిక్ మూవీగా రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన‌ అన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. సక్సెస్ ఫుల్ హీరో మహేష్ – డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ‘#SSMB28’ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.