దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్నా’సర్కారు వారి పాట’ టీం

316
mahesh-babu-and-keerthy-suresh-completed-sarkaru-vaari-paatas-first-schedule-in-dubai
mahesh-babu-and-keerthy-suresh-completed-sarkaru-vaari-paatas-first-schedule-in-dubai

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా, కీర్తి సురేష్ కథానాయికగా చేస్తోంది.

 

బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాలతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లే షూటింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దర్శకుడు ప‌రశురామ్. దుబాయ్ షెడ్యూల్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాలు, మ‌హేశ్, కీర్తిసురేష్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించింది చిత్ర యూనిట్‌. తాజాగా దుబాయ్ షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది చిత్రబృందం. త‌దుప‌రి షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.