అత్యధికంగా సంపాదించిన సినీ ప్రముఖుల్లో ప్రభాస్ ఫోర్బ్స్ ప్రకటించిన వంద మంది సెలబ్రిటీల్లో 44వ స్థానంలో నిలిచారు. సెలబ్రిటీల ఆదాయం, పేరు ప్రఖ్యాతులు, ఫాలోయింగ్ వంటి వాటిని పరిగణలోకి తీసుకుని ఫోర్బ్స్ వంద మంది ఇండియన్ సెలబ్రిటీల జాబితాని గురువారం ప్రకటించింది. ఈజాబితాలో మొదటిస్థానంలో విరాట్ కోహ్లి నిలిచారు.. రెండో స్థానంలో అక్ష§్‌ుకుమార్, గత ఏడాది మొదటిస్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్ ఈఏడాది మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది..
ఇందులో తెలుగు నుంచి రూ.35 కోట్ల ఆదాయంతో ప్రభాస్ 44వ ర్యాంక్‌తోపాటు రూ.35కోట్లతో మహేష్‌బాబు 54వ ర్యాంక్‌ని సాధించారు. రూ.21.5 కోట్ల ఆదాయంతో త్రివిక్రమ్ 77వ ర్యాంక్‌ని దక్కించుకున్నారు. ఇక రూ.293.25 ఆదాయంతో అక్షరు కుమార్ రెండో ర్యాంక్‌ని, రూ.229.25 కోట్లతో సల్మాన్ మూడో ర్యాంక్‌ని, రూ.239.25 కోట్లతో అమితాబ్ బచ్చన్ నాలుగో ర్యాంక్‌ని, రూ.124.38 కోట్లతో షారూఖ్ ఆరో ర్యాంక్‌ని, రూ.118.2కోట్లతో రణ్వీర్ సింగ్ ఏడో ర్యాంక్‌ని, రూ.59.21కోట్లతో అలియాభట్ ఎనిమిదో ర్యాంక్‌ని, రూ.48 కోట్లతో దీపికా పదుకొనె పదో ర్యాంక్‌ని సంపాదించారు. రూ. వంద కోట్ల ఆదాయంతో రజనీకాంత్ 13వ ర్యాంక్‌ని పొందడం విశేషం.