Mahesh Babu starrer Sarileru Neekevvaru's shooting schedules gets wrapped up
Mahesh Babu Sarileru Neekevvaru Title Song-min

అనిల్ రావిపూడి – సూపర్ స్టార్ మహేష్ బాబు’ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ రావడంతో మహేష్ తన ఫ్యామిలీతో కలిసి దసరా వెకేషన్ కి వెళ్లారు. అయితే ఈ చిత్ర షూటింగ్ దాదాపు 75శాతం పూర్తి అయిందట. అరె మహేష్ అప్పుడే అంత పూర్తి చేశాడా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. అయితే ఈ సినిమా మొత్తంలో మహేష్ తరువాత ఆ రేంజ్ లో హైలెట్ అయ్యేది బండ్ల గణేషేనట. ఒకరకంగా దూకుడు సినిమాలో బ్రహ్మానందం మహేష్ కాంబినేషన్ సీన్స్, అలాగే క్లైమాక్స్ లో బ్రహ్మానందం ట్రాక్ ఎంత గొప్పగా హిట్ అయ్యాయో… ఈ సినిమాలో కూడా బండ్ల గణేష్ ట్రాక్ ఆ రేంజ్ లో హిట్ అవుతుందట. ఇక బండ్ల గణేష్ చివరిసారిగా నటుడిగా కనిపించి దాదాపు ఏడు సంవత్సరాలు అయింది.

కాగా ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్ లో కనిపించనుందట. ఇటీవలే ‘గద్దలకొండ గణేష్’తో మాస్ ఆడియన్స్ ను అలరించిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో ఓ గెస్ట్ రోల్ లో నటిస్తుందట. ఇప్పటికే అనీల్ రావిపూడి ఆమెను సంప్రదించాడని.. గెస్ట్ రోల్ కు పూజా హెగ్డే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రకాష్‌ రాజ్‌ , రాజేంద్రప్రసాద్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.