Mahesh Babu, Maharshi, Vamshi Paidapalli, Tollywood News
Mahesh Babu, Maharshi, Vamshi Paidapalli, Tollywood News

మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కిన మహర్షి టాక్ తో సంబంధం లేకుండా వందకోట్ల వసూళ్లు సాధించింది.పీక్ సమ్మర్ సీజన్ లో రిలీజ్ అయ్యింది మహర్షి.కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఇప్పటివరకు కరెక్ట్ కంటెంట్ తో ఉన్న క్రేజీ మూవీ ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదు.అందుకే మహేష్ మామూలుగా చెప్పిన ఇండస్ట్రీ హిట్ అనే మాట నిజం అయిపొయింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

అంతేకాదు మహేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అనే క్రెడిట్ కూడా దక్కించుకుంది.టాలీవుడ్ ఆల్ టైం కలెక్షన్స్ లో టాప్ 4 గా నిలిచింది మహర్షి.ఓవర్సీస్ లో,సీడెడ్ లో నష్టాలు వచ్చినా ఓవర్ ఆల్ గా మాత్రం సెంచరీ కొట్టింది.అంతంతమాత్రం కంటెంట్ ఉన్నా కూడా అడుగడుగునా రికార్డ్స్ ని తిరగరాస్తూ మహేష్ స్టార్ డమ్ దమ్ము ఎంత ఉంది అనేది కోట్లాది రూపాయల కలెక్షన్స్ రూపంలో ప్రూవ్ చేసింది.మూడో వారం నుండి జోరు తగ్గినా టికెట్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్లేదు అనిపించుకుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఎట్టకేలకు ఆ సినిమా 50 రోజుల రన్ పూర్తిచేసుకోబోతుంది.ఈ రోజుల్లో ఒక సినిమా థియేటర్ లో 50 రోజులు ఆడడమే గగనం అనుకుంటే మహర్షి మాత్రం థియేటర్స్ నంబర్స్ పరంగా కొత్త రికార్డ్ దక్కించుకుంది.ఏకంగా 200 ల సెంటర్స్ లో 50 రోజులు పూర్తిచేసుకుని అసాధ్యం అనుకున్న రికార్డ్ ని నిజం చేసి చూపించింది.ఈ నెల 28 న మహర్షి 50 డేస్ ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు.మొత్తానికి మహేష్ బాబు ‘మహర్షి’ అనుకున్నది సాధించాడు.