Guntur Kaaram Resume shooting: మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే గత నెలలో మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడే తన భార్య బిడ్డలతో తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఈరోజు ఇండియాకి తిరిగి రావటం జరిగింది. అలాగే గుంటూరు కారం సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నట్టు సమాచారమైతే అందుతుంది.
Guntur Kaaram Resume shooting: ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న గుంటూరు కారం సినిమా పలుసార్లు షూటింగు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనికి పలు కారణాలు కూడా లేకపోలేదు.. అయితే ఈరోజు హైదరాబాదుకి తిరిగి వచ్చిన మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టే పనిలో ఉన్నారు. గుంటూరు కారం సినిమా ఈ ఏడాదే విడుదల కావాల్సి ఉండగా స్టోరీ అలాగే నటీనటుల విషయంలో మార్పులు జరగటంతో ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
ఈ ఏడాది డిసెంబర్ కల్లా గుంటూరు కారం షూటింగ్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత రాజమౌళితో చేయబోయే SSMB29 సినిమా ప్రొడక్షన్ వర్క్ లో పాల్గొంటారు. అయితే లేటెస్ట్ గా తెలుస్తుంది సమాచారం మేరకు గుంటూరు కారం సినిమా షూటింగ్ ఈనెల 16 నుంచి మొదలుపెట్టి 20 రోజులపాటు నాన్ స్టాప్ షెడ్యూల్ ని త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ కమ్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను రైటర్ రామజోగయ్యశాస్త్రి అందించినట్టు కూడా తెలుస్తుంది.

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా నుండి మొదటి సాంగ్ గాని లేదంటే టీజర్ గాని విడుదల చేస్తారని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూశారు కానీ అటువంటివి ఏమీ లేకుండా సింపుల్గా రెండు పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. వీటితో సరిపెట్టుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ త్వరగా సినిమా షూటింగ్ ముగించకపోతే సోషల్ మీడియా ద్వారా త్రివిక్రమ్పై ఎదురు తిరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ సినిమాలో శ్రీ లీలా అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. మరి మహేష్ బాబుకి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుతుందో చూడాలి.