మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ అనౌన్స్మెంట్..!

0
105
mahesh babu birthday special announcements

Mahesh Babu Sarkaru Vaari Paata: ఆగస్టు 9న సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు పుట్టినరోజు. ఆ రోజున మహేష్ అభిమానులకు ఓ త్రిబుల్‌ ధమాకా ఉండబోతుంది. మహేష్ బర్త్‌ డే సందర్భంగా ఆగస్ట్‌ 9న ఉదయం 9 గంటలకు ‘సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్’పేరుతో మహేష్ కొత్త మూవీ అప్‌ డేట్‌ రానుంది. అలాగే ‘సర్కారు వారి పాట’ టీమ్ తమ సూపర్ స్టార్ కి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఓ అదిరిపోయే పోస్టర్‌ ను రిలీజ్ చేయనుంది.

ఇక ఎప్పటినుంచో ఊరిస్తున్న మహేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రానున్న హ్యాట్రిక్ మూవీకి సంబంధించిన బిగ్ అప్ డేట్ కూడా అదే రోజున రానుంది. మహేష్ 28వ సినిమాగా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండబోతుంది. మొత్తమ్మీద ఒకే రోజున మహేష్ తన అభిమానులకు మూడు క్రేజీ అప్ డేట్స్ తో ఫుల్ కిక్ ఇవ్వబోతున్నాడు.

ప్రమోషనల్ స్ట్రాటజీతో హైప్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్.. ‘సర్కారు వారి పాట’ టీజర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశారు. ఈ పక్కా కమర్షియల్ సినిమాలో మహేష్ బాబుని దర్శకుడు పరశురామ్ ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రకాష్ రాజ్ – వెన్నెల కిషోర్ – సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ పుట్టినరోజును కూడా మహేష్ తన ఫ్యామిలీ అండ్ సన్నిహితుల సమక్షంలోనే చేసుకోకున్నాడు.

 

Previous articleసలార్ యాక్షన్ షురూ చేసిన ప్రభాస్..!
Next articleAllu Arha: కూతురి యాక్టింగ్‌ చూసి మురిసిపోయిన అల్లు అర్జున్‌!