కొత్త కార్‌వ్యాన్ కొన్న మహేష్ బాబు

265
Mahesh Babu Bought Costly New Caravan
Mahesh Babu Bought Costly New Caravan

సినీ తారలు విలాసవంతమైన జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ సినిమా చిత్రీకరణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అన్ని సౌకర్యాలు ఉండే కార్‌వ్యాన్‌ను వాడుతుంటారు.

 

 

అయితే అల్లు అర్జున్ తనకు కావలసిన విధంగా తన కార్‌వ్యాన్‌ను తయారు చేయించుకున్నారు. ఆ కార్‌వ్యాన్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా మరో టాలీవుడ్ హీరో కాస్ట్‌టీ కార్‌వ్యాన్‌ను కొనుగోలు చేశారు. అది ఎవరో కాదండి సూపర్ స్టార్ మహేష్.

 

 

మహేష్ కూడా తనకు కావలసిన సకల సౌకర్యాలు ఉండే విధంగా కార్‌వ్యాన్‌ను తయారు చేయించుకున్నారంట. ప్రస్తుతం ఈ కార్‌వ్యాన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

ఇదిలా ఉంటే మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల దుబాయ్‌లో రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.