మహేష్ బాబు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా సర్కారీ వారి పాట. మే 12న విడుదల అవుతున్న ఈ సినిమా మా ప్రమోషన్ లో భాగంగా నిన్న మహేష్ బాబు మీడియాతో మాట్లాడినప్పుడు బాలీవుడ్ సినిమా పై కొన్ని కామెంట్ చేయడం అవి వైరల్ గా మారాయి. అయితే దీనిపై ఈ రోజు మహేష్ బాబు క్లారిటీ ఇవ్వడం జరిగింది.
నిన్న మహేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ, తనని బాలీవుడ్ భరించడం కష్టమని అందుకని ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాల పై మీద ఫోకస్ పెట్టలేదని తెలియజేయడం జరిగింది. దీనితో బాలీవుడ్ మీడియాలో మహేష్ బాబు అంత రెమ్యూనరేషన్ తీసుకుంటారా అని చాలా కథనాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన వ్యాఖ్యలపై మహేశ్ బాబు వివరణ ఇచ్చారు.
సర్కారీ వారి పాట ప్రెస్ మీట్ సందర్భంగా మహేష్ బాబు టు తెలుగు మీడియా ఛానల్స్ తో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ లో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి జవాబు ఇస్తూ.. ‘బాలీవుడ్‌పై నేను ఎప్పుడు నెగెటివ్ కామెంట్స్ చేయలేదు. నేను అన్ని భాషలను గౌరవిస్తాను. బాలీవుడ్ సినిమాలు చేయనని చెప్పలేదు..నేను ఎప్పుడు తెలుగు సినిమాలే చేస్తానని చెప్పాను. అని వివరణ ఇవ్వటం జరిగింది.
దీనిపై మహేష్ బాబు మాట్లాడుతూ ఇంకా, మన తెలుగు సినిమా హిందీ ప్రేక్షకులు కూడా ఆదరించాలని ఎప్పటినుంచో కోరుతున్నాను అది ఇప్పుడు నెరవేరుతుంది… అని సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇంతలో, ఎస్ఎస్ రాజమౌళితో తన తదుపరి చిత్రం పాన్ ఇండియా చిత్రం అని మహేష్ కూడా స్పష్టం చేశాడు. దాంతో మహేష్ తనదైన శైలిలో రూమర్స్ కి బ్రేక్ ఇచ్చాడు.