‘జాతి రత్నాలు’ చిత్రయూనిట్‌పై మహేష్ బాబు ప్రశంసలు

431
Mahesh Babu Comments On Jathi Ratnalu Movie Unit

ఔట్‌ అండ్‌ ఔట్‌ హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జాతిరత్నాలు’ మూవీ తొలి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నాం అంటూ వచ్చిన మౌత్ టాక్ రెండు రోజుల్లోనే ఈ సినిమాను బ్రేక్ ఈవెన్ దగ్గరి దాకా తీసుకెళ్లింది. చిత్రంలో హీరో నవీన్‌ పొలిశెట్టి నటనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫీలింగ్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

“వన్‌ నేనొక్కడినే సెట్స్‌లో నవీన్‌ పొలిశెట్టితో మాట్లాడాను. తను చాలా నిశ్శబ్దంగా, నవ్విస్తూ కనిపించినా ఎంతోకష్టపడే మనస్తత్వం కలవాడు. తనలో స్పార్క్‌ ఉందని తెలుసు. జాతిరత్నాలు సెన్సేషనల్‌ యాక్టింగ్‌తో మా మనసుని ఆకట్టుకున్నాడు. ఎంటైర్‌ టీమ్‌కు కంగ్రాట్స్‌. సినిమాను బాగా ఎంజాయ్‌ చేశాను” అని ట్వీట్‌ చేశారు మహేష్‌.

స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిరన్తగా ఈ ‘జాతిరత్నాలు’ చిత్రాన్ని నిర్మించారు. డైరెక్టర్ అనుదీప్ కె.వి దర్శకత్వం వహించారు. చిత్రంలో న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ప్రధాన పాత్రలు పోషించగా.. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టించింది. కేవలం కామెడీనే టార్గెట్‌గా పెట్టుకొని కడుపుబ్బా నవ్వించారు ఈ జాతిరత్నాలు. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్ తెచ్చుకున్న‌ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచనలం సృష్టిస్తోంది.