స్టార్ హీరోల ఖాతాల్లో సాధారణంగా సినిమా రికార్డులు ఉండేవి. ఒకప్పుడు సినిమా ఎన్నిరోజులు ఆడింది, ఎన్ని థియేటర్లలో 100 రోజులు పూర్తిచేసుకుంది అనే లెక్కలపై రికార్డులు ఉండేవి. ఆ తరవాత సినిమా ఎంత వసూలు చేసింది అనే లెక్కలపై రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. కానీ, ఇప్పుడు కాలం మారింది. ట్వీట్లతో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. దీని కోసం స్టార్ హీరోల అభిమానులు విపరీతంగా కష్టపడుతున్నారు. ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ట్వీట్ల రికార్డు విషయంలో హీరోల అభిమానుల మధ్య ఇప్పుడు విపరీతమైన పోటీ పెరిగింది.rnrnఈనెలలో పవన్ కళ్యాణ్ అభిమానులు ట్వీట్ల రికార్డు మోత మోగించారు. తమ హీరో పుట్టినరోజు సెప్టెంబర్ 2న కాగా.. 50 రోజుల ముందే #AdvanceHBDPawanKalyan హ్యాష్ ట్యాగ్‌తో బర్త్‌డే ట్రెండ్ మొదలుపెట్టారు. 27 మిలియన్‌కు పైగా ట్వీట్స్‌తో ట్విట్టర్‌ను షేక్ చేశారు. అంతకు ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే రోజున #HappyBirthdayNTR హ్యాష్ ట్యాగ్‌తో 21.5 మిలియన్ ట్వీట్లు చేశారు ఫ్యాన్స్. కానీ, ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ వీటికి మించి ట్విట్టర్‌లో సునామీ సృష్టించారు.

rnrn

3 కోట్లకు పైగా ట్వీట్లతో ఇండియా ట్విట్టర్‌ చరిత్రలోనే ఇప్పటి వరకు లేని బిగ్గెస్ట్ ట్రెండ్‌ను మహేష్ బాబు అభిమానులు సృష్టించారు. ఈ ట్రెండ్ కేవలం మహేష్ బాబు బర్త్‌డే కామన్ డిస్ప్లే పిక్ కోసమే. ఇక మహేష్ బాబు బర్త్‌డే (ఆగస్టు 9న) రోజున ఈ ట్వీట్ల రికార్డు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. #MaheshBabuBdayCDP అనే హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లో 31 మిలియన్ ట్వీట్లు చేశారు మహేష్ బాబు అభిమానులు. ఇండియన్ ట్విట్టర్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పారు. పవన్ కళ్యాణ్ రికార్డును దాటేయడంతో ప్రస్తుతం మహేష్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

rnmahesh babu fans creats all time record in twitter with mahesh babu birthday cdp hashtagrnrn