Guntur Kaaram Business: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కు గుంటూరు కారం అనే టైటిల్ను తాజాగా ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు మొట్టమొదటిసారి కంప్లీట్ మాస్ బ్యాక్ డ్రాప్ లో కనిపించనున్నారు. గుంటూరు నేపథ్యంలో పక్కా మాస్ కమర్షియల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అనేదానిపై ప్రస్తుతం డీప్ డిస్కషన్ జరుగుతుంది.
Guntur Kaaram Business: మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు చిత్రం డైలాగ్స్ ఈరోజుకి కూడా ఎంత పాపులర్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు…. వాడు మగాడ్రా బుజ్జి…అల్లుడు season లాంటోడు వస్తాడు పోతాడు…. లాంటి కామెడీ డైలాగ్స్ దగ్గర నుంచి …నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధమాడే హక్కు లేదు…లాంటి భారీ డైలాగ్స్ వరకు ప్రతి ఒక్కటి ట్రేడ్ మార్క్ గా గుర్తుండిపోయింది.
మరి ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న పక్కా మాస్ మూవీ లో మహేష్ బాబు ఏ రేంజ్ డైలాగ్స్ చెప్తాడు అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎప్పటినుంచో మహేష్ బాబు ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టు గుంటూరు కారం లాగా మహేష్ బాబు ఘాటుగా కనిపించబోతున్నారు. ఇదిలా ఉండగా మరో పక్క ఈ చిత్రం మార్కెట్ వాల్యుపై రకరకాల అంచనాలు మొదలవుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో మంచి సక్సెస్ రేట్ ఉన్న స్టార్ గా మహేష్ బాబుకు గుర్తింపు ఉంది…. దాంతో ఈ మూవీ బిజినెస్ డీల్ ఏ రేంజ్ లో ఉంటుంది అనే విషయంపై ట్రేడ్ పండితులు అప్పుడే అంచనా కూడా సిద్ధం చేశారు. ఆంధ్రాలో 60 నైజాంలో 45 మరియు ఓవర్సీస్ లో కచ్చితంగా ఈ సినిమా 125 కోట్ల వరకు బిజినెస్ జరుపుకునే అవకాశం ఉంది అని అందరూ భావిస్తున్నారు.
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కలుపుకుంటే ఓవరాల్ గా గుంటూరు కారం 150 కోట్ల వరకు బిజినెస్ జరుపుకునే ఛాన్స్ ఉందని అంచనా. డిఫరెంట్ కామెడీ యాంగిల్ తో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించిన అలవైకుంఠపురం చిత్రం 150 కోట్ల వరకు అప్పట్లో బిజినెస్ చేసింది. మరి ఇప్పుడు గుంటూరు కారం కూడా ఆ మూవీ స్థాయి కంటే మించి బిజినెస్ చేస్తుంది అని అంచనా వేస్తున్నారు.

ప్రభాస్ నటించిన భారీ విజువల్ వండర్ ఆదిపురుష్ ప్రస్తుతం హైయెస్ట్ బడ్జెట్ మూవీ గా లిస్టులో ఉంది. ఈ చిత్రం తెలుగు డి 170 కోట్లకు జరిగినప్పటికీ ఓరకంగా ఇది హిందీ సినిమా కిందకే వస్తుంది. కాబట్టి పక్క తెలుగు మూవీ కా ఫ్యూజ్ మార్కెట్ దక్కించుకునే అవకాశం గుంటూరు కారానికే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
Web Title: Mahesh Babu Guntur Kaaram Business, Guntur Kaaram advance business report, Guntur Kaaram Pre release business, Sreeleela, Pooja Hedge, Trivikram, Guntur Kaaram shooting update, Guntur Kaaram latest shooting schedule details